ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల''ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన తెలిపింది
Bhopal HUT Case: భూపాల్ హట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బిర్యానీ, లడ్డు అనే పదాలు కోడ్ లాంగ్వేజ్ లుగా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిపినట్లు తెలిపారు.
Terror plan: నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్‌సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్‌తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ ట్రైన్ ను శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే…
Indigo Flight: ఢిల్లీకి కేరళలోని కొచ్చిన్ నుంచి ఇండిగో విమానం బయలుదేరింది. కానీ విమానంలోని ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించడంతో విమానాశ్రయ అధికారులు భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం…
Couple’s fight over 'cooking mutton on Tuesday' kills neighbour: సాధారణంగా ఇరుగుపొరుగు కుటుంబాలు ఎంతోకొంత స్నేహంగా ఉంటాయి. కొన్ని సార్లు గొడవులు జరిగితే సర్దిచెబుతుంటారు పక్కింటి వారు. అయితే ఈ ఘటనను చూస్తే వేరేవారి విషయాల్లో కలుగుజేసుకోవాలనుకునే పొరుగింటి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్యభర్తల గొడవలను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
Navaratri Special: సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే భక్తులు ఆలయం బయటే చెప్పులు విడిచి లోపలకు వెళ్తారు. ఇది సంప్రదాయం కూడా. అలాంటిది దేవుడికి చెప్పులు సమర్పించడం ఎక్కడైనా చూస్తామా.. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రం ఈ సన్నివేశం కనిపిస్తుంది. భోపాల్‌లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పించి తమ కష్టాలు చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు వివరిస్తున్నారు.…