మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(Kamal Nath) బీజేపీలో (BJP) చేరుతున్నారంటూ గత వారం జోరుగా ప్రచారం జరిగింది. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌లా కమల్‌నాథ్ కూడా హస్తానికి గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు షికార్లు చేశాయి. కానీ మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంతో వాటిన్నింటికీ కమల్‌నాథ్ ఫుల్ స్టాప్ పెట్టారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Rahul Gandhis Yatra) కోసం రాష్ట్రంలో చేస్తున్న ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో కమల్‌నాథ్ ప్రత్యక్షమయ్యారు. మంగళవారం ఉదయం భోపాల్‌లో (Bhopal) వర్చ్యూవల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌తో తనపై వస్తున్న ప్రచారానికి కమల్‌నాథ్ అడ్డుకట్ట వేశారు. అంతేకాదు.. సోమవారం తన నివాసంపై ఉన్న జై శ్రీరామ్ జెండాను కూడా తొలగించారు. దీంతో కమల్‌నాథ్ బీజేపీలో చేరడంలేదని తేలిపోయింది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భన్వర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. కమల్ నాథ్ కాషాయ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అదంతా మీడియా సృష్టి.. కమలనాథుల కుట్రలని కొట్టిపారేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలోనే మధ్య ప్రదేశ్‌లోకి రానుందని తెలిపారు. రాహుల్ కార్యక్రమం ఎటువంటి విరామం లేకుండా కొనసాగుతుందని.. యాత్ర చేయడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.
కమల్‌నాథ్ విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కోరారు. కమల్‌నాథ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని.. మీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలని ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Ka 2