Freedom Fighter Marriage: 49 ఏళ్ల మహిళతో 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడి వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Freedom Fighter Marriage: భోపాల్‌లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్‌ను మధ్యప్రదేశ్‌లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. 103 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు తన వయసులో సగం ఉన్న మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. ఈ అపూర్వ వివాహంపై జోరుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి, ఈ వివాహం 2023 సంవత్సరంలో జరిగింది. అయితే దాని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పెళ్లి ప్రత్యేకమైనది ఎందుకంటే ఇందులో వరుడి వయస్సు 103 సంవత్సరాలు, వధువు వయస్సు 49 సంవత్సరాలు.
Read Also: Delhi Horror: కత్తితో బెదిరించి.. 14 ఏళ్ల బాలుడిపై స్నేహితులు అసహజ లైంగిక దాడి
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
భోపాల్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్ 103 సంవత్సరాల వయస్సులో 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం గతేడాది జరిగినప్పటికీ ఆదివారం నాడు ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. హబీబ్ నాజర్‌కి ఇది మూడో పెళ్లి. వైరల్ వీడియోలో, హబీబ్ నాజర్ తన వధువుతో వివాహం చేసుకుని ఆటోలో తన ఇంటికి తిరిగి వస్తున్నట్లు కనిపిస్తాడు. వైరల్ వీడియోలో, ప్రజలు హబీబ్‌ను అభినందిస్తున్నారు. హబీబ్ నవ్వుతూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, దేనికీ లోటు లేదని చెప్పారు. లేని లోటు మన హృదయాల్లో ఉంది అని అన్నారు.
Read Also: Republic Day: ‘దేశ్ రంగీలా’ పాట పాడిన ఈజిప్ట్ అమ్మాయి.. ప్రశంసలు కురిపించిన ప్రధాని
తన మొదటి వివాహం మహారాష్ట్రలోని నాసిక్‌లో, రెండో వివాహం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిందని హబీబ్ నాజర్ తెలిపాడు. మొదటి బేగంకు పిల్లలు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం చనిపోయింది. అతను కూడా తన రెండవ భార్య నుండి బిడ్డను పొందాడనే ఆనందం పొందలేదు. ఆమె కూడా 2 సంవత్సరాల క్రితం మరణించింది. దీని తర్వాత, ఒంటరితనంతో పోరాడుతున్న వృద్ధుడు, 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌కు ఒకరి ద్వారా సంబంధం గురించి తెలియజేశాడు. మొదట ఆ మహిళ నిరాకరించింది, కానీ తరువాత, ఆమె వృద్ధుడికి సేవ చేయాలనుకోవడంతో, ఆమె అతని భార్యగా మారడానికి అంగీకరించింది. చివరికి ఆమె తన భర్త మరణం తర్వాత ఒంటరిగా ఉన్న ఫిరోజ్ జహాన్.. హబీబ్ రూపంలో కొత్త సహచరుడిని కలుసుకున్నారు. ఫిరోజ్ జహాన్ ప్రకారం, హబీబ్‌ను చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో ఆమె ఈ వివాహానికి అంగీకరించింది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!