అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్‌లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచాం..
వివరాల్లోకి వెళ్తే.. భర్తతో కొన్ని రోజులుగా దూరంగా తన తల్లిదండ్రలతో కలిసి ఉంటుంది. కాగా.. మే 21వ తేదీన మహిళ అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. విచారణలో భాగంగా అసలు నిజం బయటపడింది. తన భార్యను హత్య చేసినట్లు భర్త అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
Read Also: Foreign Portfolio Investors : 20 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించిన విదేశీ ఇన్వెస్టర్లు
ఈ క్రమంలో.. మే 21న నిందితుడు తన భార్యకు ఫోన్ చేసి కరోండ్ క్రాసింగ్ వద్దకు రావాలని కోరాడు. దీంతో.. అతని దగ్గరికి వచ్చిన భార్య ఫోన్ ను తన వద్దనుంచి లాక్కున్నాడు. అందులో ఒక వీడియో చూసి కోపంతో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత నిందితుడు తన ఆటోలో మృతదేహాన్ని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ పాతిపెట్టిన చెత్త డంప్ వద్ద కిరోసిన్ పోసి తగలబెట్టాడని పోలీసులు తెలిపారు. కాగా..కాలిపోయిన శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం పంపినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య), ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.