Bhopal: ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్.. బెడిసికొట్టి చివరికిలా..!
- ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్
- రూ.15 కోట్ల విలువైన ఆభరణాలు అపహరణ
- 23 అడుగుల ఎత్తు నుంచి దూకి కాలు విరగొట్టుకున్న నిందితుడు
- ఆలస్యంగా గుర్తించిన సిబ్బంది.. వస్తువులు రికవరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లోని ధూమ్ 2 సినిమా చూసి రియల్ లైఫ్‌లో అదే రీతిగా చోరీకి ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ కేటుగాడు. పాపం.. సినిమా వేరు.. రియల్ వేరు అన్న సంగతి గుర్తించక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కుట్ర వెనుక కోణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
వినోద్ యాదవ్ అనే వ్యక్తి దొంగతనాలు వృత్తిగా సాగిస్తున్నాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసి ఏం బాగుపడతాంలే అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. ఏకంగా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న ప్లాన్‌తో ధూమ్ 2 సినిమాలోని హీరో హృతిక్ రోషన్ మాదిరిగా మ్యూజియంలో చోరీ చేసి కోట్లు గడించాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఇంకేముంది.. అనుకున్నట్టుగానే భూపాల్‌లోని మ్యూజియంలోకి ఆదివారం టికెట్ తీసుకుని ఎంట్రీ ఇచ్చాడు. మ్యూజియం కలియతిరిగిన తర్వాత రహస్య ప్రాంతంలో దాక్కున్నాడు. సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోయిన తర్వాత.. రెండు గ్యాలరీ గదుల్లోకి చొరబడి విలువైన కళాఖండాలను, బంగారం, వెండి నాణేలు.. ఇలా రూ.15 కోట్లు విలువైన వస్తువులను పెద్ద బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఇక సోమవారం మ్యూజియం సెలవు ఉండడంతో ఈ యవ్వారం ఎవరికీ తెలియలేదు. అయితే మంగళవారం ఉదయం 10: 30 గంటలకు సిబ్బంది వచ్చి తలుపు తీసి చూస్తే.. అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. గదులను పరిశీలిస్తుండగా ఒక గదిలో నిందితుడు అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. 23 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో కాలుకు గాయమై పడిపోయినట్లుగా గుర్తించారు.
నిందితుడి సంచిలో గుప్తుల కాలం నాటి బంగారు నాణేలు, నగలు, పాత్రలతో పాటు బ్రిటీష్, నవాబుల కాలానికి చెందిన ఇతర వస్తువులు ఉన్నాయి. మొత్తం రూ.15 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించినట్లుగా సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇతడొక్కడే ఈ పని చేశాడా? ఇంకెవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రియాజ్ ఇక్బాల్ తెలిపారు. గోడ దూకడంలో నిందితుడు విఫలమయ్యాడని.. కాలుకు గాయమైనట్లుగా చెప్పారు. మ్యూజియం నుంచి దాదాపు 50 వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. మ్యూజియం వెలుపల సహచరుడి అవకాశాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
రికవరీ చేసిన వస్తువుల్లో ఒక్కొక్కటి 50 నుండి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలు ఉన్నాయి. వాటి విలువ రూ. 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రికవరీ చేసిన వస్తువుల మొత్తం విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈ వస్తువులు మ్యూజియంలోని కేవలం రెండు గదుల నుంచి తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం మ్యూజియంలో రూ. 50 కోట్ల కంటే ఎక్కువ విలువైన కళాఖండాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ సంఘటన స్టేట్ మ్యూజియంలో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. ఇందులో అలారం వ్యవస్థ లేకపోవడం, చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా మ్యూజియం యొక్క తలుపులు అల్యూమినియంతో తయారు చేయబడి ఉండడంతో బలహీనంగా ఉన్నట్లుగా గుర్తించారు. పైకప్పు భాగాలు కూడా సులభంగా విరిగిపోయే ప్లాస్టిక్ షీట్లతో కప్పబడి ఉన్నాయి. ఇక దొంగతనాన్ని అరికట్టడంలో సెక్యూరిటీ గార్డులు కూడా విఫలమయ్యారు. తాను చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నం చేశానని, అయితే గార్డులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. నిందితుడి నేపథ్యం, మరింత సమాచారం కోసం దర్యాప్తు చేయడానికి బీహార్‌లోని గయాలోని యాదవ్ ఇంటికి పోలీసు బృందం పంపించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు