మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మరణించారు. ప్రమాదం జరిగిన పిల్లల వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా.. మిగతా 36 మంది క్షేమంగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న పిల్లల బంధువులు వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో…
మధ్యప్రదేశ్‌లో మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్-నబీ ఉరేగింపులో మంగళవారం అల్లర్లు చెలరేగాయి. మధ్యప్రదేశ్ లోని దార్, భర్వాని, జబల్‌పూర్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కూడా తీవ్రంగా అల్లర్లు చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.…