Bhatti Vikramarka: కారు ఉంటే తప్ప యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహా స్వామిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు యాదాద్రి జిల్లా దగిరిగుట్ట లో భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట అత్యంత పవిత్రమైన ప్రదేశమన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తాము చేసే పాదయాత్రలకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్లినా అప్పటి కాంగ్రెస్ పాలను గుర్తు చేస్తుకుంటున్నారు అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భట్టి అన్నారు.