నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. గుర్రంపోడు మండలం పాల్వాయి శివారులోని లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలను సీఎల్పీ నేత కలిశారు.
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 85వ రోజు నేడు నల్గొండ జిల్లా చందంపేట మండలం మురుపునూతల గ్రామం పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ మహిళా కూలీల వద్దకు వెళ్లి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Bhatti Vikramarka: సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నక్కలగండిలో పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలకు సిద్ధమైన భూ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని మండిపడ్డారు.
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని మర్లపాడ్ తండాకు చేరుకున్న సందర్భంగా రోడ్డు పక్కనే గ్రామస్తులు మూడవత్ రెడ్యానాయక్, హనుమంతు నాయక్, బొజ్యానాయక్, జగన్ నాయక్, సత్య నాయక్, రాంలీ నాయక్, రమేష్ .. భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు.