నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్ భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా సేకరించారన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖను పంపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. ముంపు నిర్వాసితులకు ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తాను అన్న మాట తప్పితే తలనరుక్కుంటాను అన్న సీఎం మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు.
Also Read : Naveen Ul Haq: సారీ ట్వీట్‌పై నవీన్ రియాక్షన్.. రిపోర్ట్ చేయమంటూ సూచన
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకుని మూడేళ్లు పూర్తి చేస్తా అన్న హామీ ఏమైంది..? అని ఆయన అన్నారు. వట్టెం రిజర్వాయర్ కింద నాలుగు తండాలు ఒక గ్రామం ముంపునకు గురైన సరైన పరిహారం అందలేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘నిర్వాసితులకు భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఊరికి ఊరు ఉద్యోగానికి ఉద్యోగం నిర్మించి ఇవ్వాలి… కానీ ఏది సక్రమంగా ఇవ్వలేదు. నిర్వాసితులు సర్వం కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు భూమికి భూమి ఇల్లుకి ఇల్లు ఇవ్వాలి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఊరు నిర్మించి ఇవ్వాలి.’ అని ఆయన అన్నారు.
VRO Job Fraud: ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు వీఆర్వో టోకరా.. లక్షల్లో వసూలు