ఏపీకి చల్లని కబురు.. ఈ ప్రాంతాలకు వర్షసూచన!
ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం ఓ ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర- దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
స్కూల్ హాస్టల్లో ప్రమాదం.. 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి
దక్షిణ అమెరికా దేశం గయానాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల హాస్టల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. సంఘటన జరిగినప్పటి నుండి..చాలా మంది పిల్లలు గల్లంతైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. గయానాలోని మహదియా నగరంలోని పాఠశాల హాస్టల్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారించబడలేదు. అదే సమయంలో మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే. మంటలు చెలరేగడంతో వారంతా హాస్టల్‌లోనే చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మతం మారాలని యువతిపై ఒత్తిడి.. “కేరళ స్టోరీ” చూసిన తర్వాత ఫిర్యాదు..
ఒక యువకుడితో రిలేషన్ లో ఉన్న మహిళ ‘‘ ది కేరళ స్టోరీ’’ చూసిన తర్వాత అతడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేశాడని, మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బలవంతంగా మోసం చేయడం ద్వారా మతమార్పిడిని నిషేధించే మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ చట్టం-2021, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఖజ్రానా పోలీస్ స్టేషన్ అధికారి దినేష్ వర్మ తెలిపారు. ప్రేమ పెళ్లితో సదరు యువతిని మభ్యపెట్టాడని యువతి, సదరు యువకుడిపై ఫిర్యాదు చేసింది. వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు దినేష్ వర్మ తెలిపాడు.
ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. శ్యామలానగర్‌లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
గ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజుల్లో చాలా మారిపోయినట్లున్నారు. ఒక్కోసారి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో, మరికొన్ని సార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణిస్తూ కనిపించారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా అంబాలాలో రాహుల్ గాంధీ ఆగి ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆయన ప్రయాణానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు షేర్ చేయబడ్డాయి.
ప్రధాని రేసులో నేను లేను.. విపక్షాల ఐక్యతే ముఖ్యం..
విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు. దేశాభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. ఇటీవల మరణించిన పూణే యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామ్ తకవాలే సంతాప సభలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పెద్ద విషయం కాదని అన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో మోడీ.. ఆకాశంలో గ్రాండ్ వెల్కమ్
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన నేడు రాజధాని సిడ్నీలో బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాల సహాయంతో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో ‘వెల్‌కమ్ మోడీ’ అని రాశారు. ప్రధానమంత్రిగా ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ప్రధాని అంతకుముందు పాపువా న్యూ గినియాలో ఉన్నారు. అక్కడ ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఆయన పాదాలను తాకారు. అదే సమయంలో, జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశానికి చేరుకున్న జో బిడెన్ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్ అడిగారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సిడ్నీలో ఆస్ట్రేలియన్ సూపర్ సీఈఓ పాల్ ష్రోడర్, ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్, హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్‌హార్ట్‌లతో సమావేశం కానున్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియాలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యాయత్నం.. ఆస్తి పంచడం లేదని..
చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదం చెలరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని ఆస్తిలో అన్న తనకు రావాల్సిన వాటా అన్న ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం పుంగనూరులో చోటుచేసుకుంది. గతంలో పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న నంజప్పకు కుమారులు మునిరత్నం, శంకరప్ప, కుమార్తె పార్వతమ్మ ఉన్నారు. నంజప్ప మృతి తర్వాత ఆస్తి కోసం కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ముత్తుకూరు వద్ద తండ్రి సంపాదించిన 60 ఎకరాలు, పుంగనూరు పట్టణంలోని ఇళ్లు, స్థలాల్లో భాగం కావాలని తాము కోరుతున్నా వెంకటరత్నం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని శంకరప్ప ఆవేదన చెందారు. తాను మరణిస్తే తన బిడ్డలకైనా ఆస్తి ఇవ్వాలంటూ ఆయన ఇంట్లో తలుపులు వేసుకుని సోమవారం ఉదయం పెట్రోల్ పోసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి బాటిల్ లాక్కొని ఒంటిపై నీళ్లు పోశారు. ఈ ఘటన తర్వాత శంకరప్ప కుమారుడు నంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంజప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తదనంతరం ఉన్న ఆస్తుల విషయంలోనే కుమారుల మధ్య వివాదం నడుస్తోంది.
నా ఆస్తి ఈ గుడిసెనే.. అంటూ భట్టికి మొరపెట్టుకున్న పెంటయ్య
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోగా గ్రామ శివారులో గొల్ల పెంటయ్య- లక్ష్మమ్మ దంపతులు పాదయాత్రకు ఎదురొచ్చి వాళ్లు నివసిస్తున్న పూరి గుడిసెలోకి భట్టి విక్రమార్కుని తీసుకువెళ్లారు. ప్లాస్టిక్ కవర్లతో వేసుకున్న కప్పు, కర్రలు పాతుకుని దానికి అడ్డం పెట్టుకున్న తడకలు చూయిస్తూ ఇదే మా సొంత ఆస్తి ఈ గుడిసేనే అంటూ…. ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా ఇంటి కోసం ఎమ్మెల్యే, గ్రామ సర్పంచును అడిగి విసిగి వేసారి పోయామని, ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు.