మాయల పకీర్ లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ సబండ వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షాలు నెరవేర్చకుండా దగా చేశారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 42 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1.20 లక్షల కోట్ల రూపాయలకు పెంచి తెలంగాణలో అదనంగా ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించమని అధికారం ఇచ్చిన ప్రజలను వంచన చేసి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తాకట్టు పెట్టిన సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వచ్చే ప్రభుత్వాలు దాదాపు 30 ఏండ్ల పాటు ప్రజలపై పన్నుల భారం మోపాల్సిన దుస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ భ్రమలో నుంచి ప్రజలు తేరుకొని పీపుల్స్ మార్చ్ తో కదం తొక్కుతుండ్రు అంటూ ఆయన పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపదను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని గుర్తించిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి చేయడానికి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్నాను అని భట్టి అన్నారు.
Also Read : Rajasthan :మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. కట్ చేస్తే.. శవమైంది..
పాదయాత్రకు ఎదురు వచ్చి మహిళలు స్వచ్ఛందంగా ఇక చాలు దొర పాలన అంటూ కేసీఆర్ పై ఆక్రోశాన్ని వెలగక్కుతుండ్రు అని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీడ వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికారం ఉందని విర్రవీగి, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఎంతమందిని అరెస్టు చేయిస్తారో చేసుకోండి.. తెలంగాణ గడ్డ పౌరుషాల అడ్డ.. పోలీస్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరు లేరు.. తప్పు చేసేది ఎంత పెద్ద వారైనా అచ్చంపేట గడ్డ ప్రశ్నిస్తుంది అని అన్నారు.
Also Read : Health Warnings: సిగరెట్‌పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్న ఆ దేశం
చేతిలో అధికారం ఉందని పోలీసులతో బెదిరించాలని చూస్తే అధికార పార్టీ నాయకులను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు జాగ్రత్త అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. అధికార పార్టీ నాయకులు విర్రవీగేది ఇక రెండు నెలలు మాత్రమే.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ఆటలు ఇక సాగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలని మోడీ, కేసీఆర్ డబ్బులు పంపించిన అక్కడి ప్రజలు వారిని కట్టగట్టి నేలకు కొట్టారు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తది. ప్రజలకు అండగా ఉంటది. ధరణిపై హక్కులు కోల్పోయిన రైతులందరికీ భూములపై హక్కులు కల్పిస్తుంది అని భట్టి విక్రమార్క అన్నారు.