బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర శిబిరం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలవేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లాలో పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు.
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. స్టీల్ ప్లాంట్ పెట్టే శక్తి ఉంటే బయ్యారంలో పెట్టు.. విశాఖ వద్దు బయ్యారం ముద్దు అని ఆయన అన్నారు.
కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సీఎల్సీనేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా లో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఅర్ అని మండిపడ్డారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు.