పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా తిమ్మాజీపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే నిర్బంధం అడుగడుగున భయంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారని ఆయన అన్నారు. కొట్లాడితే కొలువులు రావన్న భయంతో నిరుద్యోగులు, ధరణిలో భూమి మాయం అవుతుందని రైతులు, పింఛన్లు బంద్ అవుతాయని పేదలు, రేషన్ కార్డులు ఇవ్వరని ప్రజలు ఇలా అనేక వర్గాలు బీఆర్ఎస్ అరాచక పాలనలో భయం భయంగా గడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమస్త తెలంగాణ సమాజం మరొకసారి ఏకం కావాలి సంపద, నీళ్ల కోసం నిలదించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. ల్యాండ్, స్యాండ్, మైన్స్, వైన్స్ దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేసే పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులకు లేదని, అసైన్డ్, మాన్యం భూములతో పాటు బొందల గడ్డ భూములను కూడా బీఆర్ఎస్ నాయకులు వదలట్లేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు పంచుతామని చెప్పి సీఎం కేసీఆర్ పేదల భూములు గుంజుకుంటుండని ఆయన అన్నారు.
Also Read : MI vs GT: శుబ్మన్ గిల్ వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం
ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వరకు పాదయాత్ర చేసిన నేను చెప్తున్న ప్రతి మాటపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ను గెలిపించి తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలని ఓట్లు వేయించిన యూనివర్సిటీ విద్యార్థులు నేడు కొలువులు రాక గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళ లాగా తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపద కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పెద్దల బాగు కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోలేదని, నాలుగు కోట్ల ప్రజలు బాగుపడటానికి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, అమ్మ హస్తం పథకం ద్వారా ఇచ్చే తొమ్మిది రకాల సరుకులు ఇవ్వట్లేదు. సంచిని, సరుకులను మాయం చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందన్నారు. నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటేనే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.
Also Read : Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..