సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రంగారెడ్డి జిల్లా చౌదరి గూడ మండలం లక్ష్మీదేవి పల్లిలో ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్దాలు గడుస్తున్నా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కావడం లేదని, నీళ్లు రావడం లేదన్నారు. రాష్ట్రాన్ని పాలించే పెద్దలకి చేయాలనే సంకల్పం లేదు కాబట్టే నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ హయం లో శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టు లు నిర్మించమన్నారు. ముఖ్యమంత్రి ప్రాణహిత చేవెళ్లను చంపి కాళేశ్వరం నిర్మించాడు. కాళేశ్వరం గోదావరి నది మీద కట్టిన చెక్ డ్యామ్ మాత్రమే అన్నారు. దాని వల్ల ఒక్క ఎకరాకు నీరందలేదు. ఎక్కడా నీళ్లు రావొద్దు కానీ ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకోవడమే పనన్నారు. లక్ష్మీదేవిపల్లికి జూరాల నుండి నీరు పారించాలన్నారు.
Also Read : GT vs SRH: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే?
నీళ్లు పారించడానికి గతంలో ఉన్న ఆంధ్ర పాలకులు అడ్డు లేరు కదా ఇప్పుడున్నది మీరే కదా ఎందుకు పారడం లేదన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కృష్ణ నది నుండి ఒక్క చుక్క కూడా పాలమూరు కు పారలేదన్నారు. లక్ష్మీ దేవి పల్లి రిజార్వాయర్ పూర్తి చేయకపోతే ఈ ప్రాంతంలో ఓట్లు అడగను అన్న సీఎం మాట మీద ఉంటే తో పాటు ఈ ప్రాంతంలో బీఆర్‌ఎస్ నాయకులెవ్వరు ఓట్లు అడగొద్దన్నారు. దున్నే వాడిదే భూమి యాక్ట్ మొట్టమొదటి సారి చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. భూముల్లేని ప్రజలకు భూములిచ్చమన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే కేసీఆర్ పాలనను అర్ధం చేసుకుంటున్నారు. ఓటు తో బీఆర్‌ఎస్‌కు పోటు పొడిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారన్నారు. కాంగ్రెస్ 2023 లో అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి తో పాటు లక్ష్మీ దేవి రిజార్వార్ పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లయిన ముఖ్యమంత్రి కి కృష్ణా జలాల్లో మన వాట తేవడం చేత కాలేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామన్నారు. పెన్షన్లు ఇంట్లో ఇద్దరు వృద్దులుంటే ఇద్దరికి ఇస్తామన్నారు. 5 లక్షల వరకు వైద్యం చేయించుకోవడం కోసం ఆరోగ్య శ్రీ ని అందుబాటులోకి తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి నెలము 4 వేలు ఇస్తామన్నారు.
Also Read : Volodymyr Zelenskyy : బ్రిటన్ ప్రధానిని కలిసి జెలెన్ స్కీ
ప్రభుత్వం ఇందిరమ్మ ఇచ్చిన పెడల్ భూములను లాక్కుంటే తిరగబడండన్నారు. వారికి అండగా ఉంటామన్నారు. భట్టితో పాటు సభలో పాల్గొన్న గద్దర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఆట పాటలతో… తుటాల్లాంటి మాటలతో అలరించారు. గద్దర్ మాట్లాడుతూ… ఓటును నోటుకు అమ్ముకోవద్దని, బానిసలు కావొద్దన్నారు. తెలంగాణ ఓటర్లు ఓట్లతో గుద్ది బీఆర్‌ఎస్‌ని ఇంటికి పంపాలన్నారు. Kcr యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ… ఊరిరికి మద్యం షాపులు పెట్టి యువతను మద్యానికి బానిస ను చేసిండన్నారు. కేసీఆర్ అంబేద్కర్ బొమ్మ మాత్రమే పెట్టారు కానీ, మనసులో అంబేద్కర్ లేదన్నారు. రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారన్నారు.