ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మంత్రి హారీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖను వదిలేసి భజన శాఖను తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని అడిగి హరీష్ రావు భజన శాఖను తీసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో పేషెంట్లు స్ట్రేచర్లు లేక కాళ్లు పట్టుకుని గుంజుకుపోవాల్సిన…