1. నేడు సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు. పోడు, ఇళ్ల పట్టాల పంపిణీ, హరితహారంపై చర్చ. దశాబ్ది ఉత్సవాలపై చర్చించనున్న కేసీఆర్.
2. నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల. ఉదయం 9.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబిత.
3. నేడు ఎంపీ అవినాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ. అవినాష్ బెయిల్ పిటిషన్‌పై విచారించనున్న హైకోర్టు. రేపు సుప్రీంకోర్టులో సునీత పిటిషన్‌పై విచారణ. గంగిరెడ్డి బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పిటిషన్. గంగిరెడ్డి, సునీత పిటిషన్లు కలిపి రేపు విచారించనున్న సుప్రీంకోర్టు.
4. నేడు మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కల్యాణ్. పార్టీ ఆఫీసులో కొత్త భవనాన్ని ప్రారంభించనున్న పవన్. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్న పవన్.
5. నేడు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ముట్టడికి యాదవ సంఘాల పిలుపు. యాదవులపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం.
6. నేడు జడ్చర్లలో భట్టి విక్రమార్క సభ. హాజరుకానున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్.
7. నేడు హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,360 లుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.77,500 లుగా ఉంది.
8. పోలవరం తొలిదశ సవరించిన అంచనాలపై నేడు కీలక భేటీ. ఢిల్లీలో నేడు పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమీక్ష. సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేయనున్న జల్‌శక్తి,
9. నేడు సినీ నటుడు బ్రహ్మానందంకి ఎన్టీఆర్ పురస్కారం. ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక అకాడమీ అధ్వర్యంలో పురస్కారం ప్రధానం. నేటి సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం.