కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై…
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మార్పు కనిపించడం లేదు. చట్టాలకు భయపడకుండా ఘాతుకాలకు తెగబడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కూతురు పెళ్లి కోసం దాచి పెట్టిన బంగారు నగలు దోచుకెళ్లారు.
BJP: రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది.
Bengaluru: మొబైల్ ఫోన్ సౌండ్ తగ్గించాలని కోరినందుకు భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన మే 19న ఉత్తర బెంగళూర్‌లోని సిదేదహల్లిలోని ఎన్ఎంహెచ్ లేఅవుట్లో జరిగింది. మొబైల్ ఫోన్లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడంపై భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైందని శనివారం పోలీసులు తెలిపారు.
Covid-19: దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హోస్కోటేకి చెందిన శిశువును మొదట ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి, ఆ తర్వాత కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆస్పత్రికి తరలించారు.
Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్‌తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు.. ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం..
Techie Suicide: ఓలా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలోని క్రుట్రిమ్‌లో పని చేస్తున్న యువ ఇంజనీర్ మే 8వ తేదీన తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.