Shoaib Akhtar-India: అదృష్టం వల్లే విజయాలు.. వరల్డ్ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు!
- టీమిండియా ప్రదర్శనపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
- వరల్డ్ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు
- వరల్డ్ కప్ 2026లో అదృష్టం వల్లే విజయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar about India’s performances in T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సూపర్-8లో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుని గ్రూప్-1 నుంచి రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే ఈ మెగా టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో భారత్ అదృష్టం వల్లే విజయాలు సాధిస్తోందని, ఓ ఛాంపియన్ జట్టులా ఆడలేదని అభిప్రాయపడ్డాడు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్‌ల వల్లే మ్యాచ్‌లు గెలుస్తోందని, జట్టుగా ఆధిపత్యం చూపడం లేదని అక్తర్ అంటున్నాడు.
‘గ్రూప్ దశను పరిశీలిస్తే.. భారత్ పూర్తి స్థాయిలో ఏ మ్యాచ్‌నూ ఆధిపత్యం చెలాయించలేదు. అమెరికా మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌తో పాటు ప్రత్యర్థి డ్రాప్ క్యాచ్‌లు మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాయి. పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. వెస్టిండీస్ మ్యాచ్‌లో సంజు శాంసన్ వ్యక్తిగత ప్రతిభే భారత్‌కు విజయం అందించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అయితే భారత్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. నా అభిప్రాయం ప్రకారం ఈ వరల్డ్ కప్ గెలిచే అర్హత దక్షిణాఫ్రికాకే ఉంది. టోర్నీలో అద్భుత క్రికెట్ ఆడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నిజమైన ఛాంపియన్ జట్టులా సఫారీ టీమ్ కనిపిస్తోంది. భారత్ జట్టు ప్రదర్శనలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది’ అని అక్తర్ సూచించాడు.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
Also Read: Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశలో గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా అన్ని మ్యాచ్‌లు గెలిచింది. న్యూజీలాండ్, ఆఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడాపై విజయాలు అందుకుంది. సూపర్-8లో గ్రూప్-1లో భారత్, వెస్టిండీస్, జింబాంబ్వేపై అద్భుత విజయాలు అందుకుని దర్జాగా సెమీస్ చేరింది. ఇప్పటివరకు సఫారీలు ఓటమినే చూడలేదు. మరోవైపు లీగ్ దశలో గ్రూప్-ఏలో ఉన్న భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాపై విజయాలు అందుకుంది. సూపర్-8లో గ్రూప్-1లో దక్షిణాఫ్రికాపై ఓడిన భారత్.. వెస్టిండీస్, జింబాంబ్వేపై గెలిచి సెమీస్ చేరింది.
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!