Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.
Rameshwaram Cafe: బెంగళూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది.
కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
World’s Best Cities: ప్రతి సంవత్సరం విడుదలయ్యే వరల్డ్స్ బెస్ట్ సిటీస్ నివేదిక ప్రపంచంలోని వేలాది నగరాలను పలు కోణాల్లో విశ్లేషించి ర్యాంక్ ను అందిస్తుంది. తాజాగా విడుదల చేసిన 2025 ర్యాంకింగ్స్‌లో 270 నగరాలు వివిధ 34 ఉపవర్గాల ఆధారంగా పరిశీలించబడ్డాయి. జీవన ప్రమాణాలు, ఆర్థిక శక్తి, సాంస్కృతిక ఆకర్షణ, పర్యావరణ నాణ్యత వంటి అనేక అంశాలు ర్యాంకింగ్స్‌లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సంవత్సరం కూడా యూరప్, కొన్ని ఆసియా నగరాలు ఆధిపత్యం చెలాయించాయి.…
కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు.
ATM Cash Van Robbery Case: ఈ నెల 19న బెంగళూరు..సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్‌ను అడ్డగించి.. తాము సీబీఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ…. వ్యాన్‌లోని గన్‌మెన్, ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం…
Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Bengaluru: తన భార్యను పక్కా పథకంలో హత్య చేసిన బెంగళూర్ డాక్టర్ ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెలలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరం జరిగిన కొన్ని వారాల తర్వాత నిందితులు, పలువురు మహిళకు సంచలన మెసేజ్‌లు పంపించాడు.
Darshan Case: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్నారు.