Karnataka: కర్ణాటక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్…
Viral Post: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చేతులోని స్మార్ట్ మొబైల్ వాడి ఏ పనినైనా ఉన్నచోట నుంచే చేసుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో ప్రజలు ప్రయాణించడానికి ఉపయోగించే రవాణా మార్గాల ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓలా, ఉబర్, రాపిడో ఇలా పేరు వేరైనా కంపెనీలు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నాయని అర్థమవుతోంది. బయట చూడడానికేమో.. తాము ఆఫర్లు ఇస్తున్నాము అంటూ ప్రకటనలు చేస్తున్న, లోపల మాత్రం ప్రజలను దోపిడీ చేసేలా…
Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. చివరకు, పెళ్లి చేసుకుందామంటేనే యువకులు భయపడే స్థాయికి చేరింది. ఇటీవల, సోనమ్ ఘటన, గద్వాల్ తేజేశ్వర్ ఘటనలు భయపెడుతున్నాయి.
Workplace Harassment: బెంగళూరు నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లివ్ ఇన్ పార్ట్నర్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
Bengaluru: బెంగళూర్‌లో ఓ చెత్త లారీలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 30-35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో నింపి లారీలో విసిరేశారు. అయితే, ప్రస్తుతం మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపు కోసం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు తల్తెత్తున్నాయి. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. లైంగిక వేధింపులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నా.. భయపడడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ గ్యాంగ్.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.