Bengaluru: మొబైల్ ఫోన్ సౌండ్ తగ్గించాలని కోరినందుకు భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన మే 19న ఉత్తర బెంగళూర్‌లోని సిదేదహల్లిలోని ఎన్ఎంహెచ్ లేఅవుట్లో జరిగింది. మొబైల్ ఫోన్లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడంపై భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైందని శనివారం పోలీసులు తెలిపారు.
Covid-19: దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హోస్కోటేకి చెందిన శిశువును మొదట ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి, ఆ తర్వాత కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆస్పత్రికి తరలించారు.
Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్‌తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు.. ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం..
Techie Suicide: ఓలా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలోని క్రుట్రిమ్‌లో పని చేస్తున్న యువ ఇంజనీర్ మే 8వ తేదీన తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025.. నేడు పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. Also Read: Tirupati Gangamma Jatara: తిరుపతి గంగమ్మ…
వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ గురువారం స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేవం కానున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైసీపీ స్ధానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు
కన్నడ నటి, బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు మరింత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితులు లేవు. దీంతో సంవత్సరం పాటు కారాగారంలోనే బందీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.