Workplace Harassment: బెంగళూరు నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లివ్ ఇన్ పార్ట్నర్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
Bengaluru: బెంగళూర్‌లో ఓ చెత్త లారీలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 30-35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో నింపి లారీలో విసిరేశారు. అయితే, ప్రస్తుతం మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపు కోసం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు తల్తెత్తున్నాయి. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. లైంగిక వేధింపులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నా.. భయపడడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ గ్యాంగ్.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్‌పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కొందరిని అరెస్ట్ కూడా…
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి తండ్రి బిటి లక్ష్మణ్ భావోద్వేగ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో బిటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు.
Bomb Threat: బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఈరోజు (జూన్ 6న) బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి అందులో పేర్కొనింది.