Bengaluru: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. 13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి
- బెంగళూరులో విషాదం
- రీల్స్ చేస్తుండగా ప్రమాదం
- 13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు తల్తెత్తున్నాయి. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడో చోట ఈ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా.. యువత మాత్రం గుణ పాఠం నేర్చుకోవడం లేదు. అర్ధాంతరంగా చనిపోవడంతో కన్న వారికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 13వ అంతస్తు నుంచి పడి చనిపోయింది.
ఇది కూడా చదవండి: Iran-US Conflict: అమెరికాతో అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదు..
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
బెంగళూరులో 13 అంతస్తుల బిల్డిండ్ నిర్మాణం జరుగుతోంది. అయితే కొందరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి యువతి 13వ అంతస్తుకు వెళ్లారు. పార్టీ చేసుకుంటుండగా రీల్స్ చేయడానికి సిద్ధపడింది. అయితే ఉన్నట్టుండి భవనంలో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ షాఫ్ట్‌లో పడి పోయింది. ఎత్తు నుంచి పడిపోవడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది.
ఇది కూడా చదవండి: Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలి నుంచి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి స్నేహితుల బృందంతో కలిసి యువతి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనానికి వెళ్లిందని అధికారులు తెలిపారు. పార్టీ చేసుకుంటుండగా లిఫ్ట్ కోసం ఏర్పాటు చేయాల్సిన షాఫ్ట్‌లో పడిపోయిందని అధికారి తెలిపారు. ఆమె రీల్ షూట్ చేస్తున్నట్లు తెలిసిందని.. అయితే ఆమె ఫోన్ నుంచి మాత్రం ఏలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ప్రమాదవశాత్తు చనిపోయిందా? ఇంకేదేమైనా కారణం ఉందా? అని తేలాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?