Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు
- బెంగళూరులో రెచ్చిపోయిన మృగాళ్లు
- నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. లైంగిక వేధింపులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నా.. భయపడడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ గ్యాంగ్.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
బెంగళూరుకు దాదాపు 12 కి.మీ దూరంలో ఉన్న మైలసంద్ర సమీపంలోని రేణుక ఎల్లమ్మ లేఅవుట్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఓ యువతి.. కిరాణా సామాగ్రి కొనేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డుపై యువకులు.. యువతిని అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇంతలో ఒకరు ఆమెను చెంపదెబ్బకొట్టాడు. దుర్భాషలాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాపాడటానికి వచ్చిన స్థానికులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జగన్ రప్పా.. రప్పా.. వ్యాఖ్యలు..! పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ వార్నింగ్..!!
గ్యాంగ్ బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఇంతలో ఆమె స్నేహితుడు, స్థానికులు రావడంతో వారి సాయంతో బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కిరాణా షాపునకు వెళ్తుండగా కొంత మంది పురుషులు తనను అడ్డుకున్నారని.. అప్పటికే వారు గొడవ పడుతున్నారని తెలిపింది. అనంతరం తనను ఆపి దుర్భాషలాడి.. అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపింది. స్థానికుల సాయంతో బయటపడినట్లు బాధితురాలు చెప్పింది. సహాయం చేయడానికి వచ్చిన వారిపై కూడా దాడి చేశారని తెలిపింది.
బన్నేర్‌ఘట్ట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) 74 (ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్)తో పాటు ఇతర సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న యువతులపై ఒక యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!