Bengaluru Stampede: ఐపీఎల్-25 లో ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీమ్‌కు నిర్వహించిన సన్మాన కార్యక్రమం.. తీవ్ర విషాదాన్ని నింపిన విషయం విదితమే.. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏకంగా 11 మంది మృతిచెందగా.. ఇంకా చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామం యర్రగట్టవాండ్లపల్లెకు చెందిన బి.దివ్యాంశి (14) అనే బాలిక మృత్యువాత పడ్డారు. యర్రగట్టవాండ్లపల్లె చెందిన శివకుమార్ బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా స్టేడియం వద్దకు శివకుమార్ భార్య అశ్విని తన కుమార్తెలు దివ్యాంశి, రచనను వెంట తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో స్టేడియం గేట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో దివ్యాంశి ఊపిరాడక మృతి చెందింది. బాలిక దివ్యాంశి మృతితో స్వగ్రామంలో విషాదం నెలకొంది. నేడు స్వగ్రామంలో దివ్యాంశి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?