Bomb Threat: బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఈరోజు (జూన్ 6న) బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి అందులో పేర్కొనింది. ఈ సందేశంలో ఈ దాడి ఈరోజు మధ్యాహ్నం 3:15 గంటలకు జరగనుందని హెచ్చరించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ పోలీసులకు కూడా పంపబడిన ఈ ఇ-మెయిల్, “విదుతలై పులి” అని పిలుచుకునే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. అందులో, మతపరమైన అంశాలను ప్రస్తావించడంతో పాటు సవుక్కు శంకర్, కసబ్ లాంటి వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
అయితే, ఆ ఇ-మెయిల్ లో “మా సోదరుడి (కసబ్)ని మైనర్‌గా భావించి కేవలం విచారణ చేసి వదిలి పెట్టాలి.. కానీ, ప్రపంచ మానవ హక్కుల సంఘాల సానుభూతి పొందాలని భారత వ్యవస్థ కోరుకుంది.. అతన్ని జన్నాకు చేరేలా చేసింది” అని రాసుకొచ్చారు. భారత్ చేసిన ఈ తప్పులతో ఇప్పుడు, 1000 మంది కసబ్‌లు, సవుక్కు శంకర్‌లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. అలాగే, తమిళనాడు మెత్ ఆపరేషన్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరుతిగ ఉదయనిధితో సహా ఇతర వ్యక్తులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఇ-మెయిల్లో డిమాండ్ చేశారు.
Read Also: Indiramma Indlu : ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు
ఇక, ఆ ఇ-మెయిల్‌లో RFID ఆధారిత పేలుడు పదార్థాలు, మానవ ఆత్మాహుతి బాంబర్లను ఉపయోగిస్తామని వారు పేర్కొన్నారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే కోరమంగళ పోలీసులు పాస్‌పోర్ట్ కార్యాలయానికి చేరుకుని.. ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. పాస్ పోర్టు ఆఫీసులో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.