Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన వ్యక్తిని ఉత్తర బెంగళూర్ నివాసి సంజయ్ కెవిన్ ఎం గా గుర్తించారు. హత్యకు గురైన యువతిని 22 ఏళ్ల రోష్నీ మోసెస్ ఎంగా గుర్తించారు. వీరిద్దరు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. నేరం చేసిన తర్వాత సంజయ్ పారిపోయాడు. అయితే, హుబ్బల్లి పోలీసులు సాయంతో ఇతడిని అరెస్ట్ చేశారు. నిజానికి వీరు పెళ్లి చేసుకోవాలని గోవాకు వెళ్లారని, అయితే, ఏదో కారణం వల్ల వీరి ఇద్దరి మధ్య గొడవ ఏర్పడిందని, రెండు రోజుల తర్వాత సంజయ్ రోష్నీని చంపి మృతదేహాన్ని అడవిలో పారేసినట్లు పోలీసులు చెప్పారు.
Read Also: Extramarital affair: “లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ”.. కొడుకు సాక్ష్యంతో వెలుగులోకి నేరం..
సోమవారం ఉదయం దక్షిన గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఆమె గొంతు కోసం చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలి దగ్గర ఉన్న పర్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఉన్న బస్సు టికెట్ ఆధారంగా ప్రాథమిక ఆధారాలను సేకరించారు. టికెట్ ద్వారా చూస్తే మహిళ కర్ణాటక హుబ్బళ్లి నుంచి బస్సు ఎక్కినట్లు తేలింది.
రోష్నీ, సంజయ్ తో గత 5 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు బస్సులో గోవాకు వెళ్లినట్లే తేలింది. ప్రయాణంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తేలింది. ఆ తర్వాత దక్షిణ గోవాలోని పిలియం-ధర్బందోవా వద్ద బస్సు దిపోయారు. సంజయ్ రోష్నిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ గొంతు కోసం హత్య చేసి పారిపోయాడు. మృతదేహం దొరికిన 24 గంటల్లోనే నేరస్తుడిని పట్టుకున్నారు. రిలేషన్‌లో వివాదాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.