Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది.
బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనంటూ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నతమైన స్థాయిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని పలువురు మహిళలు నిలదీశారు.
Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
Karnataka Minister: కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన బెంగళూరు లాంటి పెద్ద నగరంలో వీధిలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు గురి కావడం తరచుగా జరుగుతాయని పేర్కొన్నారు.
Badminton coach: బెంగళూర్‌కి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్లో 7-8 మంది బాలిక అభ్యంతరకమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు హులిమావులోని బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత రెండు ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఒక వీధిలో నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 43 ఏళ్ల కృష్ణప్పగా గుర్తించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది.
IndiGo: త్రివేండ్రం నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో 5 ఏళ్ల చిన్నారి బంగారు గొలుసు కనిపించకుండా పోయింది. అయితే, ఇండిగో విమాన సిబ్బంది దొంగలించిందని ఆమె తల్లి ఆరోపించింది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ దొంగిలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 1న విమానం గాలిలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Bengaluru: బెంగళూర్‌లో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ కార్యకర్త అయిన వినయ్ సోమయ్య అనే వ్యక్తి తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కార్యకర్త టెన్నీరా మహీనా, ఎమ్మెల్యే ఎ ఎస్ సోమన్న, ఇతరుల వేధింపులే కారణమని, తప్పుడు కేసులో తనను ఇరికించినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
Suitcase murder: బెంగళూర్‌లో భార్యను హత్య చేసి, సూట్‌కేసులో దాచిన సంఘటన సంచలనంగా మారింది. తన భార్య గౌరీ(35)ని హత్య చేసినట్లు భర్త రాకేష్ ఖేడేకర్(36) తన తండ్రి రాజేంద్రకు ఫోన్ కాల్ చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. రాజేంద్ర చెబుతున్న వివరాల ప్రకారం.. రాకేష్ తనకు ఫోన్ చేసి, గౌరీతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేవాడు, అందువల్లే నేను చంపేశాడని అన్నాడు. ఆమె వేధింపుల గురించి గతంలో తన అత్తగారికి…