ఇదిలా ఉంటే, ఈ కేసులో పొలిటికల్ దుమారం చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే, బుధవారం రోజు ఈ కేసుపై సీఎం మమతా స్పందిస్తూ.. బీజేపీ, సీపీఎంలో వైద్యురాలి ఘటనలో చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయంటూ విమర్శించారు.
Mamata Banerjee: కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పార్టీలు
14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించబోమని హిందూ మహాసభ ప్రకటించింది. గ్వాలియర్ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోతకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ పేర్కొంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మరణాన్ని పురస్కరించుకుని ఇచ్చే సెలవు దినాన్ని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది.
Viral Video: నేటి తరం యువత వేరేవారి దృష్టిలో పడేందుకు, సోషల్ మీడియా ద్వారా వైరల్‌గా మారేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారికి లైక్ లు, కామెంట్ లకు తప్ప ఏదీ వారిని ప్రభావితం చేయదు. కొన్ని వీడియోలలో ప్రమాదకరమైన వీడియోలను షూట్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే వారి ఏకైక లక్ష్యంలా కనిపిస్తున్నాయి. కదులుతున్న రైలు దగ్గర నుంచి వీడియోలు పోస్ట్ చేస్తూ, రైలులోంచి దూకడం, రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్…
Bangladesh Crisis : బంగ్లాదేశ్ పౌరులు భారతదేశంలో అక్రమంగా ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం అగర్తల రైల్వే స్టేషన్లో 16 మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులు సంఘటితమయ్యారు. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపధ్యంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ రోజు హిందూ నాయకులను కలుసుకున్నారు. మంగళవారం ఢాకాలోని ఢాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రజలు ఓపికతో మెలగాలని, ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి మతంతో సంబంధం లేకుండా హక్కులు ఉన్నాయని అన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మధ్యంతర ప్రభుత్వం నుంచి సోమవారం పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని సందేశం పంపించారు. అయితే ప్రజలు ఆగ్రహానికి గురయ్యేలా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.