Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని గద్దె దించాలనే కుట్ర జరిగినట్లు వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్‌ని బంగ్లాదేశ్ నుంచి తొలగించే ప్లాన్ విదేశాల నుంచి అమలు చేయబడినట్లు తెలుస్తోంది. హసీనా పదవి నుంచి దిగిపోవడం వెనక అమెరికా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీనికి పాకిస్తాన్ కూడా తోడైంది.
షేక్ హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే రహస్య ఆపరేషన్‌లో భాగంగా 2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు, వీరిని ‘‘కోఆర్డినేటర్లు’’గా గుర్తించారు. వీరు పాకిస్తాన్, దుబాయ్, ఖతార్‌లలో అమెరికాకు చెందిన కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు చర్చలు జరిపినట్లు తెలిసిందని నార్త్ ఈస్ట్ న్యూస్‌లో చందన్ నాన్డీ నివేదిక పేర్కొంది. అదే సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, భద్రతా సంస్థలు బంగ్లాదేశ్‌పై అమెరికా భద్రతా సంస్థలు, విదేశాంగ మార్గాల ఎలాంటి తెరవెనక పనులు చేస్తున్నాయనే దానిపై దృష్టిసారించాయి.
Read Also: Balakrishhna: ఇది కదా మెంటల్ మాస్ అంటే.. బాలయ్యకు విలన్‌గా కుర్ర హీరో?
నిరసనల్లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు పాకిస్తాన్ వెళ్లి ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) అధికారిని కలిశారు. రిటైర్డ్ ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్‌కి బంగ్లాదేశ్ విద్యార్థులతో సమన్వయం చేసే బాధ్యత అప్పగించారు. విద్యార్థుల్లో ఒకరైన మహ్మద్ మహ్ఫూజ్ ఆలం ఆగస్టు 28న తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహ్మద్ యూనస్ ప్రభుత్వంలో ఆయనకు ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యాడు. ఆలంతో పాటు హసీనాను గద్దె దించిన విద్యార్థుల్లో చాలా మంది యూనివర్సిటీ, కాలేజీల్లో చదివే ముందు మదర్సా విద్యను అభ్యసించారు.
బంగ్లాదేశ్, ఖతార్ ప్రభుత్వం మధ్య సంబంధాలను భారత నిఘా ఏజెన్సీలు కనుక్కున్నాయని నివేదిక చెప్పింది. ఖతార్ ద్వారా అమెరికా బంగ్లాదేశ్ బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తంలో నగదు జమ చేసింది. విద్యార్థులు హిజ్బుల్ తెహ్రీర్, ఇస్లాంమీ ఛత్ర శిబిర్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, ఖతార్ ఛానెళ్ల ద్వారా గణనీయమైన ఆర్థిక సాయం పొందారని తెలిసింది. పాకిస్థాన్‌కు చెందిన అదే రిటైర్డ్ ISI లెఫ్టినెంట్ జనరల్ 2023 ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య దోహా హోటల్‌లో మరో బంగ్లాదేశ్ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇది షేక్ హసీనా ప్రభుత్వంపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడానికి రాయబారి పీటర్ హాస్ నేతృత్వంలో యూఎస్ ప్రయత్నాలతో సమానంగా జరిగింది.