భారత్‌లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు నివసిస్తున్నారు.. వారు పోరాడుతున్నారు. గత నెల రోజులుగా ఒక్క హిందువు కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని అన్నారు.
Bangladesh : భారతదేశ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై మొదలైన హింస, దౌర్జన్యాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల, బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి ప్రాంతంలో రాత్రి చీకటిలో ఒక వ్యక్తి ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించాడు.
Bangladesh : బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి సైన్యం ఆధ్వర్యంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారత్‌తో సంబంధాలలో మార్పు వచ్చింది.
బంగ్లాదేశ్‌లో కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు.
బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
Bangladesh: భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ భారత్‌ను కోరారు.
Womens T20 World Cup 2024 Held in UAE: అందరూ ఊహించిందే జరిగింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 బంగ్లాదేశ్ నుంచి తరలిపోయింది. ప్రస్తుతం బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన టీ20 ప్రపంచకప్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి పలు క్రికెట్ దేశాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో టోర్నీ వేదికను తరలించక ఐసీసీకి తప్పలేదు. వేదిక మార్పునకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కూడా…
నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు.. మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా.. దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్‌లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.
Bangladesh: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాపై ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయినా, ముహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు.
Bengal Governor: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ, సీపీఎం పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటన వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.