Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..
- షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కి రప్పించేందుకు చర్యలు..
- అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- రిజర్వేషన్ కోటా హింసలో షేక్ హసీనాపై మర్డర్ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా ఉద్యమం షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. రిజర్వేషన్ కోటా హింసాత్మకంగా మారడంతో, ఆ దేశ ఆర్మీ అల్టిమేటం ఇవ్వడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, షేక్ హసీనాని తమకు అప్పగించాలని పలువురు బంగ్లా నేతలు భారత్‌కి అల్టిమేటం విధిస్తున్నారు. స్థాయి మరిచి భారత్‌ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ నేతలు హసీనాను అప్పగించాలని కోరుతున్నాయి.
Read Also: MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
రిజర్వేషన్ కోటా అల్లర్లలో జరిగిన మరణాలకు షేక్ హసీనా కారణం అని చెబుతూ ఆమెపై వందలాది కేసులు నమోదయయ్యాయి. వీటిలో ఎక్కువగా హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సామూహిక హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెని విచారించేందుకు బంగ్లాదేశ్ షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌కి కొత్తగా నిమమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఆగస్టు 05న ఆమె భారత్ పారిపోయి వచ్చారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఆమెను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ఎండీ తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు.
“సామూహిక హత్యలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాతో సహా నిందితులందరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయడానికి మేము అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేస్తాము,” అని విలేకరులు సమావేశంలో అన్నారు. కొత్త కేసుల విచారణకు సంబంధించి ప్రస్తుత అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్టానికి సవరణలపై ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాత్కాలిక ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ప్రకారం.. ఈ అల్లర్లలో 1000 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. గత నెలలో హసీనా, మరో తొమ్మిది మందిపై మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది.
- Tags
- Bangladesh
- india
- Sheikh Hasina
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..