Bangladesh: “జమ్మూ కాశ్మీర్ విడిపోవాలి, మమతా బెనర్జీ స్వాతంత్య్రం ప్రకటించుకోవాలి”.. బంగ్లా ఉగ్రనేత వార్నింగ్..
- భారత్‌కి బంగ్లా ఉగ్రనేతల వార్నింగ్స్..
- జమ్మూ కాశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలను విడగొడతామంటూ ప్రగల్భాలు..
- అన్సరుల్ బంగ్లా టీమ్(ఏబీటీ) చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని మమతా బెనర్జీకి సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఉగ్రవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ నేతలుగా పేరొందిన వారిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం వారందరిని అరెస్ట్ చేసింది. వారి సంస్థలపై నిషేధం విధించింది. అయితే, హసీనా గద్దె దిగడంతో ప్రస్తుతం ఆ దేశం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉంటే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాద నేతలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానురాను ఆ దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదం పెరుగుతోంది.
బంగ్లాదేశ్‌కి చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత మహ్మద్ జాసియుద్దీన్ రహ్మానీ భారత్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ని భారత్ నునంచి విడదీయాలని పిలుపునిచ్చాడు. నిషేధిత తీవ్రవాద సంస్థ ‘‘అన్సరుల్లా బంగ్లా టీమ్(ఏబీటీ)’’కి ఇతను చీఫ్‌గా ఉన్నాడు. ఇతను తన భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల మద్దతు కోరాడు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
రెహ్మాని వరసగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతడు చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘ నేను భారతదేశాన్ని హెచ్చరిస్తున్నా. బంగ్లాదేశ్ సిక్కిం, భూటాన్ లాంటిది కాదు. ఇది 18 కోట్ల ముస్లింల దేశం. మీరు బంగ్లాదేశ్ వైపు అడుగు వేస్తే ‘‘చికెన్ నెక్’’ మూయాలని మేము చైనాకు చెబుతాం.’’ అని వార్నింగ్ ఇచ్చాడు. చికెన్ నెక్ అనేది భారత్‌లోని ఇతర భాగాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సన్నని ఇరుకైన మార్గం. దీనినే ‘సిలిగురి’ కారిడార్‌గా పిలుస్తాం.
ఇదే కాకుండా ‘‘ఈశాన్య రాష్ట్రాలను’’ విడగొడతామని బెదిరించాడు. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సాయం చేస్తాయని చెప్పాడు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా కామెంట్స్ చేశాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ పాలన నుంచి విముక్తి చేసి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని కోరాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్‌కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించాడు. షేక్ హసీనాను గద్దె దించిన విధంగానే ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. మీ దేశం కూడా విచ్ఛిన్నమయ్యే రోజు చాలా దూరంలో లేదని అవాకులు చెవాకులు పేలాడు. ఢిల్లీ పైన తౌహీద్ జెండాలు రెపరెపలాడుతాయని చెప్పాడు.
రెహ్మానిని 2013లో ఉగ్రవాద నేరాల కింద అరెస్ట్ చేశాడు. ఏబీటీ కార్యకలాపాలపై రాసినందుకు బ్లాగర్ రాజీబ్ హైదర్‌ని హత్య చేసిన నేరంలో రహ్మానీకి ఐదేళ్ల శిక్ష పడింది. ఈ ఏబీటీకి ఆల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. 2015లో దీనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఇది రాడికల్ భావాలను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!