U-19 World Cup IND vs BAN: అండర్–19 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు ఛాంపియన్ టీమిండియా మరో టైటిల్ వేటలో తమ జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈరోజు ( జనవరి 17న) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్-19తో భారత కుర్రాళ్లు తలపడతారు.
Kishan Reddy: అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు…
ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ అతడిని విడుదల చేసింది. దాంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2026…
Pakistan-Bangladesh: దివాళా దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనవరి 29 నుంచి ఢాకా-కరాచీల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల్ని ప్రారంభించనుంది.
భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ…
బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా 24 గంటలు గడవక ముందే మరో హిందువు హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో హిందువుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఇంకా పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖోకోన్ దాస్ (50) అనే వ్యాపారిని అల్లరిమూకలు కొట్టి నిప్పంటించారు. తప్పించుకునే క్రమంలో చెరువులో దూకాడు. అయినా కూడా ప్రాణం నిలబడలేదు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. నాలుగు గంటల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు.
Bangladesh: రాజకీయ అస్థిరత, తీవ్ర మనోన్మాదంలో ఉన్న బంగ్లాదేశ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడమే. అయితే, దీంట్లో విమర్శించాల్సిన విషయం ఏమిటని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ మొక్కజొన్నను పండించడంలో ‘‘పంది మలం’’ వాడటంతో ఇది వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ నిర్ణయంపై చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో పంది మలాన్ని సాధారణ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే, ముస్లిం మెజారిటీ కలిగిన బంగ్లాదేశ్‌లో ఇది…
BSF: రాడికల్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మోంచో నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హంతకులు మేఘాలయ సరిహద్దు గుండా భారతదేశానికి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ వాదనల్ని భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఆదివారం తోసిపుచ్చింది. బంగ్లా చెబుతున్నదాని ప్రకారం, సరిహద్దుల్లో ఎలాంటి కదలికలు లేవని అదికారులు చెప్పారు.