Bangladesh: “బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు అదే కారణం”: మహ్మద్ యూనస్..
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు షేక్ హసీనా పార్టీనే కారణం..
- దాడులు రాజకీయపరమైనవి.. మతపరమైనవి కాదు..
- అవామీ లీగ్‌కి మద్దతు ఇచ్చారనే దాడులు..
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి. హిందూ యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు జరిగాయి. హిందూ దేవాలయాల ధ్వంసం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్‌గా పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ దాడులు ఆగలేదు. చివరకు, భారత ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని అడ్డు్కోవాలని కోరడంతో దాడులు తగ్గాయి.
ఇదిలా ఉంటే, ఈ దాడులకు బంగ్లా చీఫ్ మహ్మద్ యూనస్ కొత్త కారణం చెప్పారు. హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కావని, రాజకీయ పరమైనవని పేర్కొన్నారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి హిందువులు మద్దతిచ్చారనే అభిప్రాయం ఉన్నందునే, రాజకీయంగా వారిపై దాడులు జరిగినట్లు చెప్పారు. ‘‘ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీకి కూడా చెప్పాను. ఈ దాడులు అనేక కోణాలను కలిగి ఉంది. హసీనా, అవామీలీగ్ దురాగతాల తర్వాత దేశం ఒక తిరుగుబాటుని ఎదుర్కొన్నప్పుడు, వారికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులు జరిగాయి’’ అని చెప్పారు.
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్
‘‘అవామీ లీగ్ కార్యకర్తల్ని కొట్టేటప్పుడు, బంగ్లాదేశ్ హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులనే అభిప్రాయంతో వారిపై దాడులు జరిగాయి. జరిగినవి సరైనవని నేను అనడం లేదు కానీ..కొందరు దాన్ని సాకుగా చూపి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి, అవామీ లీగ్, హిందువుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు’’ అని చెప్పారు. తాను న్యూఢిల్లీలో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని, ప్రధాని మోడీ ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత మరియు ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత మద్దతుని తెలియజేశారని చెప్పారు.
1971 లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో 22 శాతం ఉన్న హిందువులు, ఇప్పుడు 170 మిలియన్లలో 8 శాతం ఉన్నారు. ప్రధానంగా లౌకిక వైఖరి అవలంభిస్తుందని అవామీ లీగ్‌కి మద్దతు ఇస్తున్నారు. భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు గురించి చర్చిస్తూ, యూనస్ భారతదేశంతో మంచి సంబంధాల కోసం కోరికను వ్యక్తం చేశాడు, అయితే షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందనే కథనాన్ని న్యూఢిల్లీ తప్పక విరమించుకోవాలని పట్టుబట్టారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!