బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 21 నెలల తర్వాత రిషబ్ పంత్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్కు కూడా స్థానం లభించింది. అలాగే.. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టారు. మరోవైపు.. బౌలర్ యశ్ దయాళ్ను కూడా అదృష్టం వరించింది. కాగా.. సెప్టెంబర్ 19 నుంచి తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం బీసీసీఐ తొలి టెస్టుకు మాత్రమే జట్టును ప్రకటించింది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్), ధ్రువ్ జురెల్ (వికె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.
Read Also: Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..