Bangladesh: పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?
- పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాల కొనుగోలు చేస్తున్న బంగ్లాదేశ్..
- దాయాది దేశంలో సంబంధాలు బలోపేత చేస్తన్న బంగ్లా..
- భారత్ లక్ష్యంగా పావులు కదుపుతోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఉన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత లౌకిక దేశంగా ఉన్న బంగ్లా నెమ్మదిగా ఇస్లామిక్ రాడికల్ పాలన దిశగా వెళ్తోంది. ఇందుకు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఈ ఆరోపణల్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ ఆ దేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా తన ఆర్మీ కోసం భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తోంది. పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఆదేశాలు అందుకున్నాయని తెలుస్తోంది.
Also Read
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
Read Also: Article 370: ఆర్టికల్ 370 చరిత్ర, ఎప్పటికీ తిరిగి రాదు: అమిత్ షా..
బంగ్లాదేశ్ సాంప్రదాయకంగా ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో తటస్థ వైఖరిని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో బిగ్ ప్లేయర్స్ అయిన భారత్, చైనాలతో సమతుల్యంగా ఉండేది. అయితే, ఇప్పుడు మాత్రం పాక్ నుంచి రక్షణ సామాగ్రి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం భారత్‌ని అలర్ట్ చేసింది. ఈ రక్షణ రంగ ఆర్డర్లు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను సూచిస్తోంది. నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ 40,000 రౌండ్ల మందుగుండు సామగ్రిని, 2,000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామగ్రిని, 40 టన్నుల RDX పేలుడు పదార్థాలను మరియు 2,900 హై-ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్‌ని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (POF) నుండి ఆర్డర్ చేసింది. ఈ షిప్‌మెంట్స్ మూడు దశల్లో బంగ్లాకి పాక్ అందివ్వనుంది. సెప్టెంబర్ 2024లో తొలి విడతతో ప్రారంభమై, డిసెంబర్ 2024 వరకు డెలివరీలు పూర్తవ్వనున్నాయి.
బంగ్లాదేశ్ ఇలా ఆయుధాలను కొనుగోలు చేయడంపై భారత్‌కి హెచ్చరిక లాంటిదే. ముఖ్యంగా ఇటీవల కాలంలో బంగ్లాలో భారత వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆ దేశంలో బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీలు ఏకంగా భారత్‌ని హెచ్చరించే స్థాయిలోకి వెళ్లాయి. మరోవైపు పాక్‌కి చేసిన ఆర్డర్లలో సరిహద్దు నుంచి 30 కి.మీ వరకు పేల్చగలిగే ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే బంగ్లా చుట్టూ భారత్ ఉండటం, మన దేశాన్ని టార్గెట్ చేస్తూనే వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో బంగ్లా రక్షణ సంబంధాలు భారత్‌ని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు