బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఖండించారు. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులు.. బౌద్ధులపై నిరంతర దాడుల నివేదికలు కలవరపెడుతున్నాయని, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం వారి భద్రతకు భరోసా ఇస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు. 'మతం, కులం, భాష లేదా గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస.. దాడులు ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదు' అని 'X' లో పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లో నిరసనలకు విద్యార్థులే నాయకత్వం వహించినట్లు కనిపించినప్పటికీ.. ముఖ్యంగా మైనారిటీ హిందువులపై హింస ఉగ్రవాద సంస్థలచే నిర్వహించబడిందని నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఉగ్రవాద సంస్థల నుండి భారతదేశానికి ముప్పు పెరుగుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు సమాచారం.
St Martin's Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు.
BSF Arrested: బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసాకాండ తర్వాత తిరుగుబాటు నేపథ్యంలో భారత్ లో ఆందోళనలు పెరిగాయి. వందలాది మంది బంగ్లాదేశ్ పౌరులు భారత సరిహద్దు దగ్గర గుమిగూడి చొరబాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం కూడా, 11 మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది సత్వరమే వారిని పట్టుకొని వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. Trai…
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు.
ప్రభుత్వం, ప్రజలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇప్పుడు సైన్యం. బంగ్లాదేశ్‌లో ఎవరూ సురక్షితంగా లేరు. కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఇప్పుడు అదుపు తప్పింది.
రోహింగ్యాలకు సంబంధించి మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త వెలువడింది. మయన్మార్ విడిచి బంగ్లాదేశ్‌కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ల ద్వారా దాడులు చేశారు
Bangladesh : బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు.. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Bangladesh : బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. ఇదిలా ఉండగా దేశంలో కొత్త ఘట్టం మొదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.