బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఇవాల సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఊహించని పరిణామం నెలకొంది. బండి సంజయ్ సిట్ కు లేఖ రాశారు. తను సిట్ ముందు హాజరుకాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్నారు.
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రజలు అన్న మాటలే నేను, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిట్ అంటే సీఎం సిట్ అంటే సిట్... స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ఎద్దేవ చేశారు.
తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
సిరిసిల్లకి మీరేం చేశారో చెప్పండి? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి వినోద్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..