Bandi sanjay: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఇవాల సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఇవాల బండి సంజయ్ సిట్ కు లేఖ రాశారు. తను సిట్ ముందు హాజరుకాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్ ఇవ్వలేనని లేఖలో పేర్కొన్నారు. సిట్ మీద నమ్మకం లేదని తెలిపారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుకు లేదని అన్నారు. తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే ఉన్న సమాచారం ఇస్తానని తెలిపారు. ఆ హక్కు నాకు ఉందని అన్నారు. నేను మొదటి నుంచి సిట్టంగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాంచ్ చేస్తున్నాని తెలిపారు. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా సిట్ నోటీస్ లు నాకు అందలేద అని, ఈ విషయం నాకు మీడియా లో వచ్చిన సమాచారం మేరకు స్పందిస్తున్నానని తెలిపారు. ఈ నెల 24 న హాజరు కావాలని కోరినట్టు మీడియా కథనాల ద్వారా నాకు తెలిసిందని అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా నేను సభకి హాజరు కావాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కాదు కూడదు నా హాజరు తప్పని సరి అని మీరు భావిస్తే మరో డేట్ ఇవ్వండి అప్పుడు వస్తా అంటూ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని డేట్ ఖరారు చేయండి అంటూ సిట్ కు బండి సంజయ్ లేఖ రాశారు.
Read also: Congress: నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. రాహుల్ గాంధీపైనే చర్చ
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ ఆధారాలను తనకు సమర్పించాలని బండి సంజయ్‌ను నోటీసుల్లో కోరారు. మార్చి 24న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వాచ్‌మెన్‌కు చెప్పి.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు. బండి సంజయ్ ఇంటికి నోటీసులు అంటించారనే వార్తలపై ఆయన స్పందించారు. తనకు సిట్ నోటీసులు అందలేదని సంచలన వ్యాఖలు చేశారు. సిట్ నోటీసులు అంటించిన ఇల్లు ఎవరిదో తనకు తెలియదన్నారు. ఏ ఇంటికి నోటీస్ లు అంటించారో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. దొంగలు వేశారో ఏమో.. నేను పోయే సరికి ఏదో కాగితం చినిగి పోయి ఉందని, అసలు సిట్ నోటీస్ లు నాకు అందలేదన్నారు. మాట్లాడితే నోరు మూస్తం అనే చెప్పేందుకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే భయ పడము అన్నారు. పేపర్ లీకేజీ సర్వసాధారణమని ఓ కబ్జాల మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తి చేశారు.
Congress: నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. రాహుల్ గాంధీపైనే చర్చ