TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సిట్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం జరిపే సిట్ విచారణకు వెళ్లకూడదని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ తరుఫున బీజేపీ లీగల్ టీమ్ సిట్ ముందుకు హాజరవుతుందని తెలుస్తోంది.
Also Read: Land For Jobs Scam Case: తేజస్వి యాదవ్‌పై ప్రశ్నల వర్షం.. 8 గంటలపాటు సీబీఐ విచారణ
ఈ కేసు సంబంధించిన ఆధారాలతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్‌కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు తనకు బదులుగా బీజేపీ లీగల్ టీమ్‌ను పంపాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. రేపు బీదర్‌లో నిర్వహించే అమిత్ షా సభకు బండ సంజయ్ హాజరుకానున్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సిట్ విచారణకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తీసుకుని ఈ నెల 24న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. తాను ఇంట్లో లేకపోవటంతో ఇంటికి నోటీసులు అంటించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని.. బండి సంజయ్ చెప్పటంతో ఆయన మరోసారి నోటీసులు ఇచ్చారు.
Also Read:Women’s World Boxing Championships: నీతూ గంగాస్ కు ‘గోల్డ్ మెడల్’
కాగా, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో బీజేపీ టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకదు సిట్ విచారణ పై తనకు నమ్మకం లేదంటూ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.