Maha dharna in Indira Park: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. మహాధర్నాకు పోలీస్ లు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ కోర్ట్ నుండి అనుమతి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతి లభించింది. అంతే కాకుండా.. సాయంత్రం 4 గంటలకు ధర్నా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా పేరిట దీక్ష చేపట్టనున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే మహాధర్నాకు హైకోర్టు కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. 500 మందితో ధర్నా చేసుకోవచ్చని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. ధర్నాను సాయంత్రం 4 గంటలకు ధర్నా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని హైకోర్టు తెలిపింది. అయితే ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ అధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగ మహా ధర్నాలో కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, అభ్యర్థులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, Tspsc పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్లపై ధర్నా చేపట్టారు.
Read also: Today Business Headlines 25-03-23: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ సూపర్ మార్కెట్. మరిన్ని వార్తలు
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌కి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాల బండి సంజయ్ ఇంటికి వెళ్లిన సిట్ ఇన్ స్పెక్టర్ అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో సిట్ పేర్కొన్నారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశంలో సంజయ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారే అత్యధికంగా క్వాలి పై అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆరోపణలకు సంబంధించిన అంశంలో సాక్ష్యాలను అందజేయాలంటూ గతంలోనే సంజయ్ కి నోటిసులు ఇచ్చింది సిట్. పార్లమెంటు సమావేశాలు ఉండటంతో సిట్ ముందు విచారణకు హాజరు కాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని, ఏ ఇంటికి సిట్ నోటీసులు అంటించిందో తెలియదంటూ సంజయ్ పేర్కొన్నారు. దీంతో మరోసారి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది.
Asteroid: భూమికి దగ్గరగా గ్రహశకలం.. పడితే ఓ నగరమే ఖతం