టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు సర్వ నాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు.