బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు మూడుకూడా ముకుమ్ముడి బీఆర్ఎస్ పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు.
పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్కు సిట్ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్ నోటీసులు తనకు రాలేదని, సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సిట్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.