Bandi sanjay: ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తామని, కేసులు, జైళ్లు మాకు కొత్త కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.. మహాధర్నాకు పోలీస్ లు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ కోర్ట్ నుండి అనుమతి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కొడుకును మెడలు పట్టి బయటకు తోయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కు సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Extramarital Affair: ప్రియురాలి కోసం భార్య హత్య.. సినిమా స్టైల్‌లో స్కెచ్.. చివర్లో ట్విస్ట్
సిట్ పోలీస్ లను నేనే స్వాగతించిన, నోటీస్ లు నేనే తీసుకున్నానని అన్నారు. మా లీగల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుందని, దొంగలను ఈ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. ముందు పేపర్లలీక్ లో ఇద్దరు మాత్రమే కారణం అన్నారు. ఇప్పుడు 20 మందికి ఎందుకు నోటీస్ లు ఇచ్చారు ట్విట్టర్ టిల్లు అంటూ వ్యంగంగా మాట్లాడారు. ముందు నువ్వు రాజీనామా చెయ్యాలని అన్నారు. ఏమన్నా మాట్లాడితే చాలు కోర్టుకు వెళ్తారని ఎద్దేవ చేశారు బండిసంజయ్. Tspsc పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీ లెక్క.. నీ కుటుంబం లెక్క.. దొంగ దందాలు చేసి జైలుకు పోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తామని మాకు కేసులు, జైళ్లు కొత్త కాదని సంచలన వ్యాఖ్యాలు చేశారు బండిసంజయ్.
Maharashtra: దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌ను చెట్టుకు కట్టేసి బాలికపై గ్యాంగ్ రేప్