Bandi sanjay: రేపు విచారణకు రండి.. బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌కి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాల బండి సంజయ్ ఇంటికి వెళ్లిన సిట్ ఇన్ స్పెక్టర్ అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో సిట్ పేర్కొన్నారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశంలో సంజయ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారే అత్యధికంగా క్వాలి పై అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆరోపణలకు సంబంధించిన అంశంలో సాక్ష్యాలను అందజేయాలంటూ గతంలోనే సంజయ్ కి నోటిసులు ఇచ్చింది సిట్. పార్లమెంటు సమావేశాలు ఉండటంతో సిట్ ముందు విచారణకు హాజరు కాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని, ఏ ఇంటికి సిట్ నోటీసులు అంటించిందో తెలియదంటూ సంజయ్ పేర్కొన్నారు. దీంతో మరోసారి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది.
Read also: Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
నిన్న (24)న సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఊహించని పరిణామం ఎదురైంది. బండి సంజయ్ సిట్ కు లేఖ రాశారు. తను సిట్ ముందు హాజరుకాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్ ఇవ్వలేనని లేఖలో పేర్కొన్నారు. సిట్ మీద నమ్మకం లేదని తెలిపారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుచుకోలేనని అన్నారు. తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే ఉన్న సమాచారం ఇస్తానని తెలిపారు. ఆ హక్కు నాకు ఉందని అన్నారు. నేను మొదటి నుంచి సిట్టంగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాంచ్ చేస్తున్నాని తెలిపారు. సిట్ నోటీస్ లు నాకు అందలేదని, ఈ విషయం నాకు మీడియాలో వచ్చిన కథనాలప్రకారం సమాచారం అందిందని.. ఈ నెల 24 న హాజరు కావాలని కోరినట్టు మీడియా కథనాల ద్వారా నాకు తెలిసిందని అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా నేను సభకి హాజరు కావాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కాదు కూడదు నా హాజరు తప్పని సరి అని మీరు భావిస్తే మరో డేట్ ఇవ్వండి అప్పుడు వస్తా అంటూ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని డేట్ ఖరారు చేయండి అంటూ సిట్ కు బండి సంజయ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మళ్లీ రెండో సారి సిట్ సంజయ్‌కు నోటీసులు ఇవ్వడంతో రేపు హాజరవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠత నెలకొంది.
Virginia : టూత్ బ్రేష్ తో జైలు గోడకు కన్నం.. పరారైన ఇద్దరు ఖైదీలు
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!