Bandi sanjay: నమ్మకం లేదన్నా నోటీసులు ఇచ్చారు.. నేడు సిట్ ముందుకు లీగల్ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: Tspsc పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌కు సిట్ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్ నోటీసులు తనకు రాలేదని, సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు. ఉదయం 11 గంటలకు సిట్ ఆఫిస్ కు బండి సంజయ్ లీగల్ టీం వెల్లింది. దీంతో సంజయ్ లీగల్ టీం తో సిట్ విచారిస్తుంది. వారినుంచి ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయనే దానిపై సిట్ విచారణ కొనసాగుతుంది.
Read also: Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
సిట్ నోటీస్ లకు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. నాకు సిట్ మీద నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాలు బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపానని అన్నారు. అయినా కూడా మళ్ళీ నోటీస్ లు ఇచ్చారని మండిపడ్డారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని అన్నారు. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కాం ను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండని సంజయ్ పేర్కొన్నారు. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చిందని, దాన్ని ప్రజల ముందు పెట్టానని అన్నారు. ప్రజా ప్రతినిధిగా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుందని తెలిపారు. ఈ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నానని అన్నారు. అసలు విషయం పై విచారణ జరపకుండా సిట్ నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో నేను హాజరు కావడం లేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. ఈనేపథ్యంలో బండి సంజయ్ బదులు లీగల్ టీం హాజరవుతుందని వెల్లడించారు. అయితే బండి సంజయ్ లీగల్ టీం, సిట్ కు ఎలాంటి ఆధారాలు సమర్పించనుంది, ఏం చెప్పనుంది అనేదానిపై ఉత్కంఠత నెలకొంది.
Love Failure: లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధగా ఉంటుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!