సీఎం కేసీఆర్ పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవకాశావాదానికి పరాకాష్ట కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు వింటే నాకంటే ఎక్కువ రంగులు మార్చేటోడు కూడా ఉన్నడా? అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఆయన విమర్శించారు. అంతెందుకు… సరిగ్గా 6 ఏండ్ల కింద అంటే 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్…
హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడిపారు. ముచ్చింతల్ లోని శ్రీరామానుజ సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని సందడి చేశారు. అంతకముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భుజం తట్టి పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, కిషన్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. మోడీని ఆహ్వానించేందుకు వచ్చారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి. పర్యటన ముగించుకుని తిరిగి…
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. మా అందరికీ మార్గదర్శకుడు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మరణం బాధాకరం. జంగారెడ్డి మరణంపట్ల బీజేపీ రాష్ట్ర శాఖ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్నా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే వ్యక్తి……
తెలంగాణలో బీజేపీ తన అస్థిత్వం కోసం పోరాటం చేస్తోంది. 2023 టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చిన అవకాశాలను దేన్నీ వదలడం లేదు. సీఎం కేసీఆర్ పై పోరాటానికి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎరువుల ధరలు…
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పెద్ద రచ్చగా మారింది.. రైతుల ఆందోళనతో మార్గమధ్యలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు.. ఈ ఘటనలో పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రత పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరించారని పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంజాబ్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తుండగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా…
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కి ఊరట లభించింది. ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరీంనగర్ జైలులో వున్న బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. బండి సంజయ్ తరపు వాదనలు వినిపించారు దేశాయ్ ప్రకాశ్ రెడ్డి. పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం 317 జీవో రద్దు చేయాలనీ దీక్ష తలపెట్టారని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. పోలీసులు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్ర 5 గంటలకు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు.…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు బండి సంజయ్.. ఓవైపు దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.. మరోవైపు.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య…