ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని,…
కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కార్‌పై విజృంభిస్తోన్న బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు సర్పంచ్‌లతో కలిసి సమరభేరీకి సిద్ధమవుతున్నారు. జూన్ తొలి వారంలో వారితో కలిసి మౌన దీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వేదికగా సర్పంచ్‌లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. అదేరోజు…
హైదరాబాద్ టూర్‌లో భాగంగా.. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడినదని, వాళ్ళెవరూ నామినేటెడ్ పదవులలో లేరని అన్నారు. గుజరాత్‌లో లేని అభివృద్ధి తెలంగాణలో ఉండడం చూసి.. ఆ ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. దేవుణ్ణి చూపించి, మూఢ నమ్మకాల రాజకీయాన్ని బీజేపీ నడుపుతోందని విమర్శించారు. కానీ, తాము మాత్రం దేవుణ్ణి కొలుస్తూ రాజకీయం చేస్తున్నామని గంగుల కమలాకర్…
కరీంనగర్‌లో కొనసాగిస్తోన్న హిందూ ఏక్తా యాత్ర భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరిన ఆయన.. ‘శవం వస్తే మీది, శివలింగం వస్తే మాది’ అని అన్నారు. లవ్ జిహాదీ, మత మార్పుడులను చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో బీజేపీ వస్తే ఊర్దూని నిషేధిస్తామని, మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ ఫైల్స్‌లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని…
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ…
సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకే ఈ హత్య జరిగిందని ఆరోపించిన ఆయన.. ఈ హత్య చేసిన వ్యక్తుల్ని, అలాగే వారి వెనకున్న శక్తుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మతపరంగా జరిగిన హత్యగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఈ కిరాతకమైన ఘటనపై సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లవ్ జిహాద్…
తెలంగాణ సర్కార్-రాజ్‌భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్‌లో టీఆర్‌ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు..…
సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డిలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్‌కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, రఘునందన్ రావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీకి ఫోన్ చేసిన ఆయన.. కొందరు…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నారాయణ పేట జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఉండటానికి ఢిల్లీ, జార్ఖండ్ వెళ్లారన్న ఆయన.. ప్లీజ్ నన్ను కలవండని బ్రతిమిలాడుకుంటున్నారు…