మౌనదీక్షకు రెడీ అవుతున్న బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ తన అస్థిత్వం కోసం పోరాటం చేస్తోంది. 2023 టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చిన అవకాశాలను దేన్నీ వదలడం లేదు. సీఎం కేసీఆర్ పై పోరాటానికి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు దీక్షను చేపట్టబోతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు ఢిల్లీలో మౌన దీక్షను చేపట్టబోతున్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితర నేతలతో కలసి ఆయన దీక్షకు దిగుతున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా వుంటే కేసీఆర్ దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్, మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్ ను అని ఆయన అంటున్నారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన తెలపాలని నిర్ణయించింది.
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!